మెదడుతో కాదు.. మనసుతో చూడండి: అభిమానులకు శ్రీవిష్ణు రిక్వెస్ట్

మెదడుతో కాదు.. మనసుతో చూడండి: అభిమానులకు శ్రీవిష్ణు రిక్వెస్ట్

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్‌‌‌‌ఎం లీడ్ రోల్స్‌‌‌‌లో విజయేందర్ ఎస్  రూపొందించిన చిత్రం ‘మిత్ర మండలి’.  బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. అక్టోబర్ 16న సినిమా విడుదల కానుంది. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌కు అతిథిగా హాజరైన హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఈ మూవీని మైండ్‌‌‌‌తో కాకుండా, మనసుతో చూడాలి.  ప్రేక్షకులను కడుపుబ్బా  నవ్విస్తుంది’ అని చెప్పాడు. 

 దర్శకులు అనుదీప్,  కళ్యాణ్ శంకర్, వివేక్ ఆత్రేయ, ఆదిత్య హాసన్ ఈ కార్యక్రమానికి హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఈ సినిమా నచ్చకపోతే తన నుంచి వచ్చే ఏ సినిమాను చూడొద్దని ప్రేక్షకులకు చాలెంజ్ చేశాడు ప్రియదర్శి. ఇలాంటి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్ సబ్జెక్ట్‌‌‌‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని నిహారిక చెప్పింది. 

సపోర్ట్ చేసిన వారందరికీ దర్శకుడు విజయేందర్ థ్యాంక్స్ చెప్పాడు. దీపావళికి  ఫ్యామిలీని నవ్వించే క్లీన్ ఎంటర్టైనర్‌‌‌‌ ఇదని బన్నీ వాస్ అన్నారు. తమ సినిమా అందర్నీ అలరిస్తుందని నిర్మాతలు భాను ప్రతాప, విజేందర్ రెడ్డి అన్నారు. నటులు విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, సంగీత దర్శకుడు ధృవన్ మాట్లాడారు.