ఫేస్‌బుక్ లైవ్‌లో విషం తాగిన నటుడు

ఫేస్‌బుక్ లైవ్‌లో విషం తాగిన నటుడు

బాలీవుడ్ నటుడు తీర్థానందరావు(Thrudanandarao) ఫేస్‌బుక్ లైవ్‌లో విషం తాగాడు. తనను  ఓ మహిళ డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతుందని, డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తుందని, తనపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిందని చెప్తూ FB లైవ్‌లో కన్నీరు పెట్టుకున్నాడు. ఆలా చెప్తూనే ఒక్కసారోగా విషయం తాగేశాడు.

ఇది చూసిన అతని స్నేహితులు ఇంటికి వెళ్లి చూడగా.. తీర్థానంద రావు అపస్మారక స్థితిలో కింద పడిపోయి ఉన్నాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు ప్రాణానికేం ప్రమాదం లేదని తెలిపారు. ప్రస్తుతం తీర్థానందరావు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కపిల్ శర్మ(kapil sharma)తో కలిసి పనిచేసిన కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న తీర్థానంద రావు.. గతంలో కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు సమాచారం.