
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారనే సామెత సీఎం కేసీఆర్‌కి సరిగ్గా వర్తిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని బలహీన పరచడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని.. ఈ క్రమంలో బీజేపీ పటిష్టంగా మారిందని ఆమె అన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్‌కి బీజేపీ సవాల్ విసిరే స్థాయిలోకి వచ్చిందని ఆమె అన్నారు.
‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి… ఇంకొందరిని భయపెట్టి… ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు.
కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ.. తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం టాగోర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి… ఇంకొందరిని భయపెట్టి… ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు.
— VijayashanthiOfficial (@vijayashanthi_m) November 8, 2020
For More News..