
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి భేటీ అయ్యారు. దిల్లీలోని ఆయన నివాసంలో అమిత్‌షాను కలిశారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి అమిత్ షా నివాసానికి వెళ్లి.. ఆయనతో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి కాషాయదళంలో చేరడం దాదాపు ఖరారైంది.
సమావేశం అనంతరం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. విజయశాంతి తిరిగి మాతృ సంస్థకు చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా అభినందించారన్న ఆయన.. టిఆర్ఎస్ ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బిజెపి నే అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కెసిఆర్ అణిచి చేశారని.. కుటుంబ, అవినీతి పాలనపై పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణలో బీజేపీ నే ప్రత్యామ్నాయం అన్నారు.