దయచేసి మమ్మల్ని లాగకండి.. డ్రగ్స్ కేసుపై స్పందించిన సురేఖావాణి

దయచేసి మమ్మల్ని లాగకండి.. డ్రగ్స్ కేసుపై స్పందించిన సురేఖావాణి

నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించడంపై స్పందించారు నటి సురేఖావాణి. ఆ వార్తలను ఖండిస్తూ ఒక వీడియో బైట్ ను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో సురేఖావాణి మాట్లాడుతూ.. "గత కొంతకాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మాపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఆపేయండి. మీరు చేస్తున్న వాటి వల్ల నా కెరీర్, నా పిల్లల కెరీర్, నా కుటుంబం ఆరోగ్యం.. ఇలా అన్నిరకాలుగా చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి" అంటూ చెప్పుకొచ్చారు సురేఖావాణి.

ఇక నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో ప్రధానంగా సురేఖావాణి ఇంకా ఆమె కూతురు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేపీ చౌదరితో సురేఖావాణి, ఆమె కూతురు సన్నిహితంగా ఉన్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇదే విషయంపై తాజాగా సురేఖావాణి స్పందిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం సురేఖావాణి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.