
బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా పబ్ లో డ్రగ్స్ పట్టివేత కేసులో పలువురు సెలబ్రిటీలు దొరకడం హాట్ టాపిక్ గా మారింది. నటి నిహారిక, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ పలు రాజకీయ ప్రముఖుల పిల్లలకు పోలీసులు నోటిసులిచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు తన పేరును ప్రచారం చేస్తున్నారని సినీ నటి హేమ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హల్ చల్ చేశారు .అసలు తాను పబ్ కే వెళ్లలేదని.. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేకున్నా.... కొంతమంది కావాలనే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై పీఎస్ లో కంప్లైంట్ చేస్తామన్నారు హేమ .