వెంకన్న సన్నిధిలో జాన్వీ కపూర్

వెంకన్న సన్నిధిలో జాన్వీ కపూర్

తిరుమల శ్రీవారిని బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేధ్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన జాన్వీ కపూర్ తో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. జాన్వీ ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.