మహారాష్ట్ర సంక్షోభం..కంగనా కామెంట్స్ వైరల్

మహారాష్ట్ర సంక్షోభం..కంగనా కామెంట్స్ వైరల్

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన చీఫ్, సీఎం ఉద్దవ్ థాకరే రెండు రోజుల క్రితం అధికార నివాసం వర్షను ఖాళీ చేశారు. ఈ టైంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గతంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

సీఎం ఉద్ధవ్  పై గతంలో హాట్ కామెంట్స్ చేశారు కంగనా. ‘‘ నా ఇల్లు కూల్చేసి పగ తీర్చుకున్నానని ఉద్దవ్ అనుకుంటున్నారు. నా ఇంటిని కూల్చేశారు..రేపు మీ అహంకారం ఇలానే కూలిపోతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇది గుర్తుంచుకోండి’’ అంటూ ఉద్ధవ్ పై కంగనా చేసిన కామెంట్స్ హాట్ టాఫిక్ గా మారాయి. 2020 సెప్టెంబర్ 9 న ముంబయిలోని పాలీ హిల్స్ లో ఉన్న కంగనా రనౌత్ ఆఫీస్ ను అక్రమంగా నిర్మించారని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొంత వరకు కూల్చివేశారు. మహారాష్ట్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియో మరోసారి వైరల్  అయ్యింది.