
బాలీవుడ్ వివాదాస్పద నటిగా పేరున్న కంగనా రనౌత్ ఏం చేసినా అది హాట్ టాపిక్‌గానే మారుతోంది. ఈ బోల్డ్ బ్యూటీ చుట్టూ తాజాగా కొత్త వివాదం నడుస్తోంది. సౌత్ సినిమాలను కంగనా చిన్న చూపు చూస్తోందని కొందరు ఆమెపై మండిపడుతున్నారు. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాకు ఈ హీరోయిన్ నో చెప్పడమే ఇందుకు కారణం.
ధనుష్ 50వ సినిమా కావడంతో సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో దీన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు బాలీవుడ్ క్వీన్ క్యాల్షీట్లు లేవంటూ నో చెప్పిందట. దీంతో త్రిషను కన్ఫర్మ్ చేశారు. అంతకుముందు శింబుకు జోడీగా నటించేందుకు కూడా కంగనా ఇలాంటి కారణమే చెప్పి తప్పించుకుంది. దీంతో ఈ నటి కావాలనే సౌత్ సినిమాలను దూరం పెడుతుందనే ప్రచారం సాగుతోంది. మరి దీనిపై ఈ బాలీవుడ్ క్వీన్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.