కీర్తి సురేశ్​ పెళ్లెప్పుడంటే..?

కీర్తి సురేశ్​ పెళ్లెప్పుడంటే..?

మహానటి తర్వాత దసరాతో మరోసారి సక్సెస్​ అందుకుంది కీర్తిసురేశ్​. ఇందులో వెన్నెలగా నటించి క్రిటిక్స్​ను సైతం మెప్పించింది. ఫేమ్​తో పాటుగా కీర్తి చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక రూమర్​ ఉంటూనే ఉంటుంది. కొంతకాలంగా ఈ బ్యూటీ పెళ్లి వార్తలు ఇంటెర్నెట్​లో చక్కర్లు కొడుతున్నాయి. కేరళకు చెందిన ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతోందనే వార్త ఆ మధ్య వైరల్​ అయ్యింది.

ఆ తర్వాత తమిళ స్టార్​ దళపతి విజయ్​తో ఆమె డేటింగ్​లో ఉందంటూ గాసిప్​లు వినిపించాయి. ఇదే విషయంపై ఓ అభిమాని ఆమెను పెళ్లెప్పుడు చేసుకుంటారు? అని అడిగాడు. దీనికి కీర్తి సమాధానం ఇస్తూ ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని.. సరైన వాడు దొరికితే కచ్చితంగా చేసుకుంటానని తెలిపింది. దీంతో పెళ్లి, డేటింగ్​ అంటూ తనపై వస్తున్న వార్తలకు చెక్​ పెట్టింది.