‘కూ’లో చేరిన నటి కృతి సనన్

V6 Velugu Posted on Sep 01, 2021

  • వారంలో 20వేలు దాటిన ఫాలోవర్లు

భారతీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ‘కూ’ (Koo) లో బాలీవుడ్ నటి కృతి సనన్ చేరిపోయింది. తన ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోవడంతో చేరిక ఫ్యాన్స్ కు తెలిసిపోయింది. కూ యాప్ లో చేరిన వారంలోనే కృతి సనన్ కు ఫాలోవర్లు  20 వేలు దాటిపోయారు. ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఈ బాలీవుడ్ నటి @kritisanon అనే హ్యాండిల్ తో తన అభిమానులకు చేరువయ్యారు. రెండు వారాల క్రితం తన స్నేహితుడు, స్టార్ నటుడు టైగర్ ష్రాఫ్ భారతీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారంలో చేరి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చి ఘనమైన స్వాగతం పొందిన విషయం తెలిసిందే. కృతి చేరిన వెంటనే తన ఫ్యాన్ క్లబ్స్ అయిన @FAN-OF-KS, @Kriti_Sanon_FC, @krotsaffection, @team_kritian కూడా ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు.
కృతి సనన్ కూ (Koo) లో తన అబ్బురపరిచే కళ్ల (Eyes) ఫోటో జత చేసి తాను చేరినట్టు ప్రకటించడంతో పాటు మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో కూడా షౌట్ ఔట్ ద్వారా కూ (Koo) లో చేరినట్టు తన అభిమానులకు తెలిపారు. ఈమె రీసెంట్ తాజాగా పోస్ట్ చేసిన ఒక అందమైన ఫోటోగ్రాఫ్ కి 1700 కు పైగా లైక్స్ వచ్చాయి. బాలీవుడ్ తోపాటు బహుభాషా నటిగా మారిన కృతి ఇప్పుడు వివిధ భాషలలో తన అభిమానులతో కనెక్ట్ అవడానికి కూ (Koo) ని ఉపయోగించనుంది. కృతి సనన్ తన ప్రాజెక్ట్స్ మరియు స్క్రిప్ట్స్ తో పాపులారిటీ మరియు సపోర్ట్ సంపాదించుకుంటున్నారు. ఈ మధ్య ఓటీటీ లో విడుదలై స్క్రీన్ ప్లే మరియు తన నటనకు విమర్శకుల ప్రశంసలు పొందిన ‘మిమ్మీ’ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న కృతి ఇప్పుడు ప్రభాస్ తో భారతీయ పౌరాణిక చిత్రం ఆదిపురుష్ లో కూడా నటిస్తున్నారు.
కూ (Koo) యాప్ ని డౌన్లోడ్ చేయడం ఎలా?
దేశీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కూలో అందరూ చేరేందుకు ఆసక్తి కనబరుస్తూ డౌన్లోడ్ చేయడం ఎలా అంటూ సెర్చ్ చేస్తున్నారని కూ యాప్ ప్రకటించింది. అభిమాన నటులే కాదు ఇతర అన్ని రంగాల్లోని ప్రముఖులు, అథ్లెట్లు, రాజకీయ నాయకులు, ఎంటర్టైనర్లను  కూ (Koo) లో ఫాలో అవ్వొచ్చు. యూజర్లు నచ్చిన భాషలలో కమ్యూనికేట్ చేయడానికి కూ (Koo) ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. 
 

Tagged , bollywood updates, Koo App, actress Kriti Sanon, heroin Kriti Sanon, bollywood actress Kriti Sanon, Kriti Sanon updates

Latest Videos

Subscribe Now

More News