చర్మ వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్

చర్మ వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్

ప్రముఖ నటి మమతా మోహన్ దాస్ ను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. గతంలో క్యాన్సర్‭ బారిన పడి కోలుకున్పోన ఆమె.. ప్రస్తుతం చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. విటిలిగో అనే చర్మ సమస్యతో సతమత మవుతున్నట్లు మమత సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.  'ప్రియమైన సూర్య భగవంతుడా... ఇప్పుడు నేను నిన్ను ఎంతో ప్రేమతో హత్తుకుంటున్నా. నా శరీరం రంగు మారుతోంది. అందుకే నీవు రాక ముందే నీ కోసం నిద్ర లేచి.. నీ కిరణాల కోసం ఎదురు చేస్తున్నా. నీ శక్తిని నాకు అందించు. నా జీవితంలో ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను' అని పోస్టులో రాసింది.  

విటిలిగో సోకిన వారిలో చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. రోజులు గడిచే కొద్ది మచ్చల సైజు పెరుగుతుంది. శరీరం రంగు కూడా మారుతుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో మమతా మోహన్ దాస్ టాలీవుడ్‭లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా యమదొంగ తర్వాత చింతకాయల రవి, కింగ్ మూవీల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్యాన్సర్ బారిన పడటంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె.. దాన్నుంచి కోలుకున్నాక సినిమాల్లో అడపాదడపా కనిపించారు.