Gold Rate: 3వ రోజూ కుప్పకూలిన గోల్డ్.. హైదరాబాదులో భారీగా తగ్గిన బంగారం రేట్లివే..

Gold Rate: 3వ రోజూ కుప్పకూలిన గోల్డ్.. హైదరాబాదులో భారీగా తగ్గిన బంగారం రేట్లివే..

Gold Price Today: యుద్ధాలు కొలిక్కి వస్తున్న వేళ ప్రపంచ వ్యా్ప్తంగా ఆందోళనలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతూ బంగారం నుంచి ఇతర ఇన్వెస్ట్మెంట్ల వైపు మళ్లేలా చేస్తోంది. దీంతో వరుసగా మూడో రోజు కూడా పసిడి ధరలు తగ్గటంతో వారాంతంలో ప్రజలు ఆభరణాల కొనుగోలు కోసం ఆసక్తి చూపుతున్నారు. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.5వేల 500 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 930, ముంబైలో రూ.8వేల 930, దిల్లీలో రూ.8వేల 945, కలకత్తాలో రూ.8వేల 930, బెంగళూరులో రూ.8వేల 930, కేరళలో రూ.8వేల 930, వడోదరలో రూ.8వేల 935, జైపూరులో రూ.8వేల 945, లక్నోలో రూ.8వేల 945, మంగళూరులో రూ.8వేల 930, నాశిక్ లో రూ.8వేల 933, అయోధ్యలో రూ.8వేల 945, బళ్లారిలో రూ.8వేల 930, నోయిడాలో రూ.8వేల 945, గురుగ్రాములో రూ.8వేల 945గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు 100 గ్రాములకు రూ.6వేలు భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 742, ముంబైలో రూ.9వేల 742, దిల్లీలో రూ.9వేల 757, కలకత్తాలో రూ.9వేల 742, బెంగళూరులో రూ.9వేల 742, కేరళలో రూ.9వేల 742, వడోదరలో రూ.9వేల 747, జైపూరులో రూ.9వేల 757, లక్నోలో రూ.9వేల 757, మంగళూరులో రూ.9వేల 742, నాశిక్ లో రూ.9వేల 745, అయోధ్యలో రూ.9వేల 757, బళ్లారిలో రూ.9వేల 742, నోయిడాలో రూ.9వేల 757, గురుగ్రాములో రూ.9వేల 757 వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.89వేల 300 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.97వేల 420గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 17వేల 800 వద్ద ఉంది.