
బ్రిడ్జ్‌టౌన్(బార్బడోస్): బౌలింగ్‌లో చెలరేగిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌సిరీస్‌లో బోణీ చేసింది. పేసర్‌జోష్ హాజిల్‌వుడ్ (5/43), నేథన్‌లైయన్(2/20) రాణించడంతో.. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో ఆసీస్159 రన్స్‌తేడాతో గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలు 1–0 ఆధిక్యంలో నిలిచారు. 301 రన్స్‌లక్ష్య ఛేదనలో విండీస్‌రెండో ఇన్నింగ్స్‌లో 33.4 ఓవర్లలో 141 రన్స్‌కే ఆలౌటైంది.
షమేర్‌జోసెఫ్(44), జస్టిన్ గ్రీవ్స్(38 నాటౌట్), జాన్‌కాంప్‌బెల్ (23), కేసీ కార్టీ (20) మోస్తరుగా ఆడారు. అంతకుముందు 92/4 ఓవర్‌నైట్‌స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్‌రెండో ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 310 రన్స్‌కు ఆలౌటైంది. ట్రావిస్‌హెడ్ (61), బ్యూ వెబ్‌స్టర్(63), అలెక్స్ క్యారీ (65) మెరుగ్గా ఆడారు. ట్రావిస్‌హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.