
సీని నటి పూనమ్ కౌర్ ఎమోషనల్ అయింది. రాజ్భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. తాను తెలంగాణలో పుట్టానని కానీ తనని పంజాబీ అమ్మాయిగా వెలివేశారంటూ కంటతడి పెట్టుకుంది. తాను తెలంగాణ బిడ్డనని అలా దూరం చేయకండంటూ వాపోయింది. మరోవైపు రాజ్భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీని నటి, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఖుష్బూ, వివిధ రంగాలకు చెందిన మహిళా నిపుణులు, ప్రముఖులు,ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన మహిళలకు పురస్కారాలు అందచేశారు.