హీరోయిన్ ప్రణీత పెళ్లి.. భర్త ఎవరంటే?

V6 Velugu Posted on May 31, 2021

బెంగళూరు: టాలీవుడ్ బ్యూటీ, అత్తారింటికి దారేది ఫేమ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ పెళ్లి చేసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిరాడంబరంగా ఈ ఈవెంట్‌ జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణీత తన జీవిత భాగస్వామిగా చేసుకుంది. తమది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని ఈ బెంగళూరు భామ చెప్పుకొచ్చింది. భర్త నితిన్ రాజు గురించి మాట్లాడుతూ.. తాము ఒకరికొకరం చాన్నాళ్లుగా తెలుసని, కొందరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా తమకు పరిచయమైందని ప్రణీత చెప్పింది.

ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నాయని.. అయితే కరోనా పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయో తెలియదు కాబట్టి త్వరగా ఒకటయ్యేందకు ఈ నిర్ణయం తీసుకున్నామని  ప్రణీత తెలిపింది. కరోనా నిబంధనలను ఫాలో అవుతూ సింపుల్‌గా మ్యారేజ్ చేసుకున్నామని వివరించింది. పెళ్లి ఎప్పుడనేది సడన్‌గా ఖరారైందని, ఇందుకు క్షమించాలంటూ ఫ్యాన్స్‌కు సారీ చెప్పింది. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’, ఎన్టీఆర్ ‘రభస’, మంచు మనోజ్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’, మంచు విష్ణు ‘డైనమైట్, బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ (గెస్ట్ అప్పీరియన్స్) మూవీస్‌తో తెలుగునాట ప్రణీత మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ప్రణీత భర్త నితిన్‌ రాజు బ్యాక్ గ్రౌండ్ గురించిన విషయాలపై సెర్చింగ్ ప్రారంభించారు నెటిజన్లు. 

Tagged Bengaluru, Covid restrictions, Actress Pranitha Subhash Marriage, Nitin Raju, Tollywood Heroine Pranitha

Latest Videos

Subscribe Now

More News