Ranya Rao Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. కన్నడ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Ranya Rao Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. కన్నడ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

కన్నడ నటి రన్యా రావుకు బంగారం స్మగ్లింగ్ కేసులో ఏడాది జైలు శిక్ష ఖరారు అయింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ మరియు స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ చట్టం (COFEPOSA) కింద సలహా బోర్డు ఆమెకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.

ఈ కేసులో రన్యా రావుతో పాటు మరో ఇద్దరు నిందితులు చేర్చబడ్డారు. ఈ లేటెస్ట్ ఉత్తర్వు ప్రకారం, ఒక సంవత్సరం జైలు శిక్ష కాలంలో ఈ ముగ్గురూ తమ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కోల్పోయారు. అంటే, వారిలో ఎవరూ కూడా మొత్తం శిక్షా కాలంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోలేరు అన్నమాట! 

అసలేమైందంటే?

హర్షవర్ధని రణ్య అని కూడా పిలువబడే రన్యా రావు.. 2025 మార్చి 3న దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ బెంగళూరు ఎయిర్​పోర్ట్లో ​​పట్టుబడింది. అక్కడ రన్యా రావు నుంచి రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు నటి రన్యా రావుపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారించారు. ఈ విచారణలో పోలీసులు పలు విస్తుపోయే నిజాలు కనుగొన్నారు. ఇందులో ముఖ్యంగా రన్యా రావు తాను గోల్డ్ స్మగ్లింగ్ కి పాల్పడటం ఇదే మొదటిసారి అని ఇంతకుముందెన్నడూ ఇలాంటి పనులు చెయ్యలేదని తెలిపినట్లు వెల్లడించారు.

ALSO READ : KINGDOM: ‘కింగ్డమ్‌‌’ సూపర్ ఎమోషనల్ సాంగ్.. 

అలాగే, రన్యా రావు తాను గోల్డ్ స్మగ్లింగ్ ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాదు ఎయిర్పోర్ట్ లో పోలీసుల చెకింగ్ సమయంలో వాష్ రూమ్ కి వెళ్లాలని చెప్పి, వాష్ రూమ్ లో బంగారం దాచి వచ్చి.. చెకింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ బంగారం అక్కడి నుంచి తరలించడం ఇదంతా సినీ ఫక్కీ స్టైల్ లో ప్లాన్ చేసుకున్నానని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఇలా ఒక్కటేమిటీ చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె బెయిల్ పిటిషన్స్ అప్లై చేసుకుంది. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు, సెషన్స్ కోర్టు మరియు కర్ణాటక హైకోర్టు కూడా రన్యారావు బెయిల్ పిటిషన్స్ ను తిరస్కరించాయి.

రన్యా రావు COFEPOSA నిబంధనల ప్రకారం కస్టడీలో ఉంది. ఇది అక్రమ రవాణా లేదా విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలకు సంబంధించింది. అందువల్ల రన్యా రావుకు బెయిల్ అనుమతి లేకుండా.. ఒక సంవత్సరం వరకు COFEPOSA కింద సలహా బోర్డు ఆమెకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.