నా కొడుకు అమర్ దీప్కి ఓటేయండి.. ఫ్యాన్స్ను రిక్వెస్ట్ చేస్తున్న నటి రాశి

నా కొడుకు అమర్ దీప్కి ఓటేయండి.. ఫ్యాన్స్ను రిక్వెస్ట్ చేస్తున్న నటి రాశి

బిగ్‌బాస్ సీజన్-7(Bigg boss season7) చాలా ఉత్కంఠగా ముందుకు సాగుతోంది. గతం లేని విధంగా ఈ సీజన్ ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తోంది. ముందుగా చెప్పినట్లుగా ఉల్టా పుల్టా కాన్సెప్ట్ సూపర్ గా వర్కౌట్ అయ్యింది. వార వారం కొత్త కొత్త ట్విస్టులతో ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తోంది. ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయంలో ఇంటి సభ్యులు ఏమాత్రం తగ్గడం లేదు. ఆడియన్స్ కూడా ఫుల్లుగా సపోర్ట్‌ చేస్తున్నారు. ఎవరి ఫేవరేట్ కంటెస్టెంట్స్ లను వారికి ఓట్లు వేయాలంటూ ఆడియన్స్ ను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. 

తాజాగా సీరియల్ యాక్టర్ అమర్ దీప్‌కు సపోర్ట్‌ చేస్తూ నటి రాశి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో ను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం నేను మీ రాశి. బిగ్‌బాస్-7 లో నా కొడుకుగా నటించిన(జానకి కలగనలేదు సీరియల్ లో) అమర్ దీప్‌కే నా సపోర్ట్. మీరు కూడా అతడిని సపోర్ట్ చేసి ఓటు వేయండి.. అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్స్ కూడా ఆ వీడియోపై పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. 

కొందరు అమర్ దీప్ కు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో దయచేసి అతనికి ఓటు వేయమని అడగకండి రాశి గారు అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరేమో.. మీ కోడలుగా నటించిన ప్రియాంక పరిస్థితి ఏంటి రాశి గారు అని అడుగుతున్నారు.