మేకప్ లేకుండా రష్మికను చూశారా?

మేకప్ లేకుండా రష్మికను చూశారా?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి లాక్ డౌన్ విధించడంతో అన్ని వ్యాపారాలు షట్ డౌన్ అయ్యాయి. ప్రజలను ఎంటర్ టైన్ చేసే సినిమా ఇండస్ట్రీది ఇదే పరిస్థితి. లాక్ డౌన్ తో అనుకోకుండా ఖాళీ టైమ్ దొరకడంతో సెలబ్రిటీలు తమకు ఇష్టమైన వ్యాపాకాలతో బిజీ అయిపోయారు. పుస్తకాలు చదువుతూ, కుకింగ్ చేస్తూ, ఇండోర్ వర్కౌట్స్, బోర్డ్ గేమ్స్ ఆడుతూ సెలెబ్రిటీలు సరదాగా గడుపుతున్నారు.

టాలీవుడ్ పాపులర్ హీరోయిన్ రష్మిక మండన్న ఎప్పటికప్పుడు స్పెషల్ మూమెంట్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ ‘సరిలేరు’ భామ మేకప్ లేకుండా దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ‘ఛలో’తో రష్మిక మంచి మార్కులే సంపాదించింది. సెకండ్ సినిమా గీత గోవిందంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవర్ నైట్ పాపులర్ తెచ్చుకుంది.

గత రెండేళ్లలో వరుస బ్లాక్ బస్టర్ లతో దూసుకెళ్తున్న రష్మిక తన సక్సెస్ రేటును అమాంతం పెంచుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్ సరిగ్గా ఆడకపోయినప్పటికీ సరిలేరు నీకెవ్వరుతో బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా మైండ్ బ్లాంక్ సాంగ్ లో మహేశ్ తో కలసి రష్మిక వేసిన స్టెప్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న రష్మిక.. కోలీవుడ్ లోనూ తన పాగా వేసేందుకు సిద్ధమైంది. ఖైదీతో అదిరిపోయే హిట్ కొట్టిన కార్తీ సరసన ‘సుల్తాన్’ మూవీలో నటిస్తూ తమిళ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన పుష్పలో యాక్ట్ చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. ఇందుకోసం కొన్నాళ్లుగా చిత్తూరు యాసను నేర్చుకుంటోంది.