
టాలీవుడ్తో పాటు తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అలనాటి అందం సుహాసిని. టాలీవుడ్లో అగ్ర హీరోలందరితోనూ నటించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ రోల్స్ చేస్తోంది. దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకున్న తర్వాత టాలీవుడ్కు దూరమైనప్పటికీ చిన్న పాత్రల్లో కనిపిస్తోంది.
మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. కమలహాసన్, శింబు, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాసుంది.
థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న సుహాసిని తాను మణిరత్నంతో ప్రేమలో పడటానికి గల కారణాలు వెల్లడించింది. కమల్ హసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన నాయకన్ సినిమా చూసిన తర్వాత ఆయనకు ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడినట్లు చెప్పింది.
అప్పటికీ ఆయన ఎవరో తనకు తెలియనప్పటికీ, ఆయనతో ప్రేమలో పడటానికి మాత్రం ఆ సినిమాయే కారణమని వెల్లడించింది. ఆ సినిమా చేయకపోయి ఉంటే ఆయన లైఫ్లో సుహాసిని లేదు. నాయకన్ చేశారు కాబట్టే ఆయన లైఫ్ లోకి నేను వెళ్లాను' అని చెప్పింది.
ప్రస్తుతం సుహాసిని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే 1988లో సుహాసిని, మణిరత్నం పెళ్లి జరిగింది. మణిరత్నం దర్శకత్వం వహించిన పలు సినిమాలకు డైలాగ్ రైటర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా సుహాసిని పనిచేసింది.
థగ్ లైఫ్ విషయానికి వస్తే..
కమల్ హాసన్- దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం వీరిద్దరి కాంబో ఎంతో స్పెషల్. 1987లో వచ్చిన నాయకన్ మూవీ..తెలుగులో నాయకుడు గా రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకుంది. మరోసారి జతకట్టిన ఈ కాంబోపై భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే ట్రైలర్‌ను విడుదల చేశారు. మణిరత్నం తనదైన క్లాస్ టచ్‌తో కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దీని ద్వారా తెలుస్తోంది.
ఓ నాయకుడు, అతను పెంచుకునే వారసుడు.. ప్రత్యర్థులు ఆ పవర్‌ను లాక్కోవడానికి చేసే ప్రయత్నాలు.. వీటన్నింటినీ చూపిస్తూ ఆసక్తిని కలిగించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఇందులో కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. శింబు సాలిడ్ రోల్‌లో చేసినట్టుగా అర్ధమవుతోంది. ‘ఇది యముడికి నాకు జరిగే కథ.. నువ్వా నేనా’ అని కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, మహేష్ మంజ్రేకర్, అలీ ఫజల్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి వంటి స్టార్స్ ను చూపిస్తూ సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తోంది.