పోలీసు కస్టడీలో నటి తునీషా బాయ్ఫ్రెండ్

పోలీసు కస్టడీలో నటి తునీషా బాయ్ఫ్రెండ్

ముంబయి: బాలీవుడ్ యువ నటి తునీషా శర్మ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. సహ నటుడు, బాయ్ ఫ్రెండ్ షీజాన్ ఖాన్ తో బ్రేకప్ కావడం వల్లే మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు నిందితుడు షీజాన్ ఖాన్ ను అరెస్ట్ చేసి ముంబయిలోని వాసాయ్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు నిందితుడికి నాలుగు రోజుల కస్టడీ విధించింది. 

నిన్న సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న తునీషా శర్మ..  షూటింగ్ గ్యాప్ లో వాష్ రూమ్ కి వెళ్లి ఉరేసుకుంది. తునీషా ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి చూడగా ఉరేసుకుని కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇవాళ ఉదయం ఆమె బాయ్ ఫ్రెండ్ , సహ నటుడు షీజాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు.

15 రోజుల క్రితం తునీషా శర్మకు బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినట్లు ఏసీపీ చంద్రకాంత్ జాదవ్ తెలిపారు. లవ్ బ్రేకప్ కావడం భరించలేక మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఆత్మహత్య ఆధారాలు దొరికినప్పటికీ.. ఈ కేసుపై మరింత లోతుగా విచారిస్తున్నామని ఏసీపీ చెప్పారు. ఇది లవ్ జిహాద్ వ్యవహారం కాదని పోలీసులు  క్లారిటీకి వచ్చారు. షీజాన్ ఖాన్ కాల్ లిస్ట్ పై ఆరా తీశాక దీనిపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలిపారు.