మళ్లీ ఐపీఓకి అదాని..టార్గెట్ 20 వేల కోట్ల సేకరణ

మళ్లీ ఐపీఓకి అదాని..టార్గెట్ 20 వేల కోట్ల సేకరణ

న్యూఢిల్లీ: భారీ విస్తరణ ప్రాజెక్టుల కోసం రూ. 20 వేల కోట్లను సమీకరించేందుకు మరోసారి ఐపీఓ (ఫాలో ఆన్​ పబ్లిక్​ ఆఫర్–ఎఫ్‌పీఓ​) చేయనున్నట్లు అదానీ గ్రూప్‌​ ప్రకటించింది. పోర్టుల నుంచి ఎనర్జీ, సిమెంట్​ దాకా వివిధ సెగ్మెంట్లలో విస్తరణ ప్రాజెక్టులను ఈ గ్రూప్​ చేపడుతోంది. ఈ ప్రాజెక్టుల అమలుకు అవసరమైన నిధులను ఈ ఫాలో ఆన్​ పబ్లిక్​ ఆఫర్​ ద్వారా సేకరించాలనుకుంటున్నట్లు ​ శుక్రవారం స్టాక్​ ఎక్స్చేంజీలకు తెలిపింది.

గ్రూప్​లోని ఫ్లాగ్​ షిప్​ కంపెనీ అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ మార్కెట్​ నుంచి రూ. 20 వేల కోట్లను సమీకరిస్తుందని పేర్కొంది. సివిల్​ ఏవియేషన్, డేటాసెంటర్ల బిజినెస్​లు ఈ కంపెనీ చేతిలోనే ఉన్నాయి. షేర్​హోల్డర్ల బేస్​ను మరింత పెంచుకునేందుకు, ఇన్వెస్టర్లలో క్రెడిబిలిటీ పెంచుకోవడానికి ఈ ఫాలో ఆన్​ పబ్లిక్​  ఆఫర్​ సాయపడుతుంది అనేది అదానీ గ్రూప్​ ఆలోచన.

అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​లో ప్రస్తుతం  ప్రమోటర్లకు 72.63 శాతం వాటా ఉండగా, ఇన్సూరెన్స్​ కంపెనీలు, ఫారిన్​ పోర్ట్​ఫోలియో ఇన్వెస్టర్ల చేతిలో మరో 20 శాతం వాటాలు ఉన్నాయి. మిగిలిన వాటాలు పబ్లిక్​ దగ్గరున్నాయి. గత ఏడాది కాలంలో అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ షేర్లు రెట్టింపయ్యాయి. దీంతో ఈ కంపెనీ మార్కెట్​ విలువ రూ. 4.46 లక్షల కోట్లకు ఎగిసింది.

ఈ ఏడాది టైములో ఎస్​అండ్​ పీ బీఎస్​ఈ సెన్సెక్స్​ 5.4 శాతం మాత్రమే పెరగడం ఇక్కడ గమనించదగ్గది. ఎఫ్‌పీఓ ద్వారా రూ. 20 వేల కోట్ల సమీకరణకు డైరెక్టర్ల బోర్డు శుక్రవారం మీటింగ్​లో ఆమోదం తెలిపినట్లు అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ ఎక్స్చేంజీలకు సమాచారం పంపించింది. ఈ ప్రపోజల్​కు  పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా వాటాదారుల అనుమతి తీసుకోనున్నట్లు వివరించింది. షేర్లలో లిక్విడిటీ పెంచుకోవాలనుకుంటున్నట్లు ఇంతకు ముందే అదానీ గ్రూప్​ వెల్లడించింది.