12,500 కోట్లు సేకరించనున్న అదానీ ఎనర్జీ సొల్యూషన్స్

12,500 కోట్లు సేకరించనున్న అదానీ ఎనర్జీ సొల్యూషన్స్

ముంబై :  రూ.12,500 కోట్లు (1.50 బిలియన్ డాలర్లు) వరకు నిధుల సమీకరణకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సోమవారం వెల్లడించింది. కంపెనీ షేర్లు లేదా ఇతర సెక్యూరిటీలను జారీ చేయడం డబ్బును సమకూర్చుకుంటామని తెలిపింది.  క్వాలిఫైడ్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ప్లేస్‌‌‌‌మెంట్స్ ద్వారా లేదా ఏదైనా ఇతర  విధానం ద్వారా నిధులను సేకరిస్తుంది.

నిధుల సమీకరణ ప్రతిపాదనను పరిశీలించడానికి,  ఆమోదించడానికి సోమవారం తమ బోర్డు సమావేశమవుతుందని ఈ విద్యుత్​ పంపిణీ సంస్థ తెలిపింది. ఇది నిధుల సమీకరణకు కారణాన్ని,  సెక్యూరిటీలను జారీ చేయాలనుకుంటున్న ధరను వెల్లడించలేదు.