
న్యూఢిల్లీ: అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ (గతంలో అదానీ ట్రాన్స్‌మిషన్) బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.3 వేల కోట్లు సేకరించాలని చూస్తోంది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ విధానంలో 360 మిలియన్ డాలర్లను సేకరించాలని చూస్తున్నామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రోహిత్ సోని అన్నారు. వచ్చే ఏడాది ప్రారభంలో బాండ్ల ఇష్యూ ఉండొచ్చని చెప్పారు. పేపర్ వర్క్ జరుగుతోందని వెల్లడించారు. అంతేకాకుండా మరో బిలియన్ డాలర్లను సేకరించే పనిలో ఉన్నామని ఇన్వెస్టర్ల కాల్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలోపు ఈ ఫండ్స్ సేకరిస్తామని చెప్పారు. షేర్లను అమ్మడం ద్వారా రూ.8,500 కోట్లను సేకరించడానికి మేలో కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపింది.