
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) ఆదివారం రూ.1,000 కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్‌సీడీ–బాండ్ల) ఇష్యూని ప్రకటించింది. ఏడాదికి 9.30శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ ఇష్యూ ఈ నెల 9 న ఓపెనై, 22న ముగుస్తుంది.
ఇది ఏఈఎల్ రెండో పబ్లిక్ ఎన్‌సీడీ ఇష్యూ. కిందటేడాది సెప్టెంబర్‌లో రూ.800 కోట్ల ఇష్యూ తొలి రోజే ఫుల్ సబ్‌స్క్రైబ్ అయింది. గ్రూప్ సీఎఫ్‌ఓ జుగేశిందర్ సింగ్ మాట్లాడుతూ, ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఇన్‌ఫ్రా గ్రోత్‌లో భాగస్వామ్యం అవ్వొచ్చని అన్నారు. 24, 36, 60 నెలల టెనార్‌లు, త్రైమాసిక, వార్షిక, క్యూములేటివ్ వడ్డీ ఆప్షన్లు ఉన్నాయి. 75శాతం ఫండ్స్‌ను అప్పులు చెల్లించడానికి వాడతారు.