
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లాలో 250 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. దోడియం, వడ్డిరాల గ్రామాల్లో 1200 ఎకరాల భూమిని అదానీ సంస్థకు 33ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దోడియం, వడ్డిరాల గ్రామాల్లో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు 2016లోనే ప్రభుత్వ భూములను ముందస్తు పొజిషన్ ఇవ్వగా.. 2019లోనే ఈ ప్రాజెక్టు పూర్తయి, అమల్లోకి వచ్చింది. ప్రతీ ఐదేళ్లకోసారి లీజు ఫీజు 10 శాతం పెరుగుతుందని తెలిపింది.2019 నాటికి సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును పూర్తి చేశారు.