వియత్నాంలో అదానీ  పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

వియత్నాంలో అదానీ  పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్  వియత్నాంలో గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ పోర్టును నిర్మించాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ దక్కించుకుందని బ్లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్ చేసింది. పోర్టు నిర్మాణం ఇంకా ప్లానింగ్ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉందని, పెట్టుబడిపై క్లారిటీ లేదని తెలిపింది.  

ఈ పోర్టులో కంటైనర్ టెర్మినల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వివిధ అవసరాలకు వాడుకునే బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్మించనుంది. అదానీ పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్లో మొత్తం మూడు ఇంటర్నేషనల్ పోర్టులు ఉన్నాయి. గతంలో ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హైఫా పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  అదానీ గ్రూప్ కొన్నది.  తాజాగా వియత్నాంలో నిర్మించేది నాలుగో ఇంటర్నేషనల్ పోర్ట్ అవుతుంది. అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీలంకలో కొలంబియా పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టాంజానియాలో దారుస్సలామ్​ పోర్టును నిర్వహిస్తోంది. మరోవైపు కేరళలోని విజింజం పోర్టును మరింతగా విస్తరించేందుకు రూ.20 వేల కోట్లను ఇన్వెస్ట్ చేయాలని చూస్తోంది.