ఈ ఏడాది అదానీ సంపద 5.8 లక్షల కోట్లు పైకి..

ఈ ఏడాది అదానీ సంపద 5.8 లక్షల కోట్లు పైకి..

న్యూఢిల్లీ: మార్కెట్ క్యాప్ ప్రకారం దేశంలోనే అత్యంత విలువైన గ్రూప్‌‌‌‌గా అదానీ గ్రూప్ నిలిచింది.  ఏసీసీ, అంబుజా సిమెంట్‌‌లను కొనుగోలు చేయడంతో ఇప్పటి వరకు టాప్‌‌లో ఉన్న టాటా గ్రూప్‌‌ను అధిగమించి మొదటి ప్లేస్‌‌లోకి చేరుకుంది. ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీల మార్కెట్‌‌ క్యాప్‌‌ను కూడా కలుపుకుంటే  అదానీ గ్రూప్ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22.25 లక్షల కోట్లకు పెరిగింది. ఇది టాటా కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20.81 లక్షల కోట్లు కంటే ఎక్కువ. శుక్రవారం సెషన్‌‌లో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.40 వేల కోట్లు తగ్గగా, టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్‌‌ క్యాప్ రూ. 60 వేల కోట్లు తగ్గింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ రూ.17.07 లక్షల కోట్ల  మార్కెట్‌‌ క్యాప్‌‌తో  మూడో ప్లేస్‌‌లో ఉంది. 

ఈ ఏడాది అదానీ సంపద 5.8 లక్షల కోట్లు పైకి..

బ్లూమ్‌‌బర్గ్‌‌ ఇండెక్స్ ప్రకారం అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 72.5 బిలియన్ డాలర్లు (రూ. 5.8 లక్షల కోట్లు) పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపద  152 బిలియన్ డాలర్లకు ఎగిసింది.  ఈ ఏడాది సంపద ఎక్కువగా పెరిగిన బిలియనీర్ల లిస్టులో గౌతమ్ అదానీ మిగిలిన వారి కంటే అందనంత ఎత్తులో ఉన్నారు.