హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌తో న్యాయపోరుకు సిద్ధమైన అదానీ గ్రూప్

హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌తో న్యాయపోరుకు సిద్ధమైన అదానీ గ్రూప్

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌పై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ దర్యాప్తు పెంచింది. తాజాగా ఈ గ్రూప్ నిలిపేసిన రూ.20 వేల కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూ ఎఫ్‌‌‌‌పీఓతో అదానీ గ్రూప్‌‌‌‌కు చెందిన ఇన్వెస్టర్లు, ప్రమోటర్లకు లింక్ ఉందా? అనే కోణంలో సెబీ దర్యాప్తు చేపడుతోంది. హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌–అదానీ గ్రూప్ సంక్షోభం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ రెగ్యులేటరీ తన స్క్రూటినీ పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎఫ్‌‌‌‌పీఓ ప్రాసెస్‌‌‌‌లో అదానీ గ్రూప్  సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిందా? లేదా సొంత ప్రయోజనాల కోసం ఎఫ్‌‌‌‌పీఓలో  ఇన్‌‌‌‌డైరెక్ట్‌‌‌‌గా  పాల్గొందా?  అనే కోణంలో కూడా ఈ సంస్థ దర్యాప్తు జరుపుతోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. అదానీ ఎఫ్‌‌‌‌పీఓలో యాంకర్ ఇన్వెస్టర్లుగా మారిషస్‌‌‌‌కు చెందిన గ్రేట్‌‌‌‌ ఇంటర్నేషనల్ టస్కర్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌, ఆయుస్మత్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌లు పాల్గొన్నాయి. వీటితో అదానీ గ్రూప్‌‌‌‌కు ఉన్న సంబంధాలపై సెబీ ఆరా తీస్తోంది. యాంకర్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టర్ల కేటగిరీ కింద  ప్రమోటర్లకు చెందిన కంపెనీ లేదా గ్రూప్ అప్లయ్ చేసుకోవడానికి రూల్స్ అనుమతివ్వడం లేదు.  ఈ అంశంపైనే సెబీ దర్యాప్తు జరుగుతోందని సంబంధిత వ్యక్తులు వివరించారు. కాగా, ఎఫ్‌‌‌‌పీఓ ద్వారా రూ.20 వేల కోట్లను సేకరించాలని చూసిన అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌కు హిండెన్‌‌‌‌బర్గ్ రూపంలో పెద్ద షాక్ తగిలింది. కంపెనీ షేర్లు భారీగా క్రాష్ అవ్వడంతో ఈ కంపెనీ తన పబ్లిక్ ఇష్యూని విత్‌‌‌‌డ్రా చేసుకుంది. సబ్‌‌‌‌స్క్రయిబ్ అయిన యాంకర్ ఇన్వెస్టర్లకు డబ్బులు తిరిగిచ్చేసింది. మరోవైపు  అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ ఎఫ్‌‌‌‌పీఓని మేనేజ్ చేసిన 10 ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లలో రెండు బ్యాంకులయిన ఎలరా క్యాపిటల్‌‌‌‌, మోనార్క్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్ క్యాపిటల్‌‌‌‌ను కూడా సెబీ తన రేడార్‌‌‌‌‌‌‌‌లో ఉంచింది. కాగా, మోనార్క్‌‌‌‌లో అదానీ గ్రూప్‌‌‌‌కి కొంత వాటా ఉంది. ఒకవేళ ఎఫ్‌‌‌‌పీఓలో ఈ కంపెనీ కూడా పాల్గొందని తెలిస్తే అదానీ గ్రూప్ రూల్స్‌‌ను ఉల్లంఘించినట్టే. 

అదానీ ఇష్యూపై సుప్రీం కోర్ట్‌‌‌‌

అదానీ గ్రూప్‌‌‌‌పై హిండెన్‌‌‌‌బర్గ్ చేసిన ఆరోపణలకు సంబంధించి సెబీ రెస్పాన్స్‌‌‌‌ను సుప్రీం కోర్టు అడిగింది. అంతేకాకుండా ఇన్వెస్టర్లను ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో కాపాడడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, రెగ్యులేటరీ ఫ్రేమ్‌‌‌‌ వర్క్‌‌‌‌ను ఎలా బలపరుస్తున్నారో తెలియజేయాలని పేర్కొంది. దేశంలోని ఇన్వెస్టర్లను కాపాడడానికి ఒక మెకానిజం ఉండాలని సుప్రీం కోర్టు తెలిపింది. అదానీ గ్రూప్ షేర్లను ఆర్టిఫిషియల్‌‌‌‌గా పడేసేలా చేసి దేశంలోని ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవడానికి కారణమైన నాథన్‌‌‌‌ అండర్సన్‌‌‌‌ నేతృత్వంలోని హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌పై  చర్యలు తీసుకోవాలని అడ్వకేట్‌‌‌‌ ఎం ఎల్‌‌‌‌ శర్మ కిందటి వారం సుప్రీం కోర్టులో  పిల్ వేశారు. ఈ పిల్‌‌‌‌పై హియరింగ్ చేపట్టిన సుప్రీం కోర్టు, సెబీ రెస్పాండ్‌‌‌‌ అవ్వాలని ఆదేశించింది.

హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌తో యుద్ధమే..  

హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌తో న్యాయపరమైన యుద్ధానికి అదానీ గ్రూప్ సిద్ధమైంది. యూఎస్‌‌‌‌లోని పాపులర్ లీగల్ కంపెనీ వాచెల్‌‌‌‌ను ఇందుకోసం నియమించుకుంది. యూఎస్‌‌‌‌, ఇండియాలలో హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలను అదానీ గ్రూప్  తీసుకుంటోంది.  గత కొన్ని రోజులుగా న్యూయార్క్‌‌‌‌కు చెందిన లీగల్ కంపెనీ వాచెల్‌‌‌‌, లిప్టన్‌‌‌‌, రోసన్‌‌‌‌ అండ్ కట్జ్‌‌‌‌ (డబ్లూఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌కే) తో అదానీ గ్రూప్ వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. స్టాక్ మానిప్యులేషన్‌‌‌‌, అకౌంటింగ్ ఫ్రాడ్ వంటి ఆరోపణలను హిండెన్‌‌‌‌బర్గ్ చేసింది. ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో సలహా కోసం ఈ లీగల్ కంపెనీతో అదానీ గ్రూప్ చర్చలు జరుపుతోందని ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఇండియాలోని తన లీగల్ పార్టనర్‌‌‌‌‌‌‌‌ సిరిల్‌‌‌‌ అమర్చాంద్‌‌‌‌ మంగళ్‌‌‌‌దాస్‌‌‌‌ ద్వారా వాచెల్‌‌‌‌తో అదానీ గ్రూప్ సంప్రదింపులు జరిపిందని పేర్కొంది. ఈ కంపెనీ ట్విటర్‌‌‌‌‌‌‌‌కు ఎలన్‌‌‌‌ మస్క్  మధ్య జరిగిన గొడవలో మస్క్‌‌‌‌ తరపున 
పనిచేసింది. 

మూడీస్‌‌‌‌‌‌‌‌‌‌ రేటింగ్స్ డౌన్‌‌‌‌..

నాలుగు అదానీ గ్రూప్ కంపెనీలపై  మూడీస్ నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన  స్టేబుల్ రేటింగ్ నుంచి డౌన్‌‌‌‌గ్రేడ్ చేసింది.హిండెన్‌‌‌‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు అదానీ గ్రీన్‌‌‌‌ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రిస్ట్రిక్టడ్ గ్రూప్‌‌‌‌, అదానీ ట్రాన్స్‌‌‌‌మిషన్‌‌‌‌ స్టెప్‌‌‌‌ వన్ లిమిటెడ్‌‌‌‌, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌‌‌‌ల రేటింగ్‌‌‌‌ను మూడిస్ తగ్గించింది. మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్  ఇంటర్నేషనల్ తన  ఇండెక్స్‌‌‌‌లలో నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల వెయిటేజ్‌‌‌‌ను తగ్గించింది.  ఇందులో అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ కూడా ఉంది. అదానీ టోటల్ గ్యాస్‌‌‌‌, అదానీ ట్రాన్స్‌‌‌‌మిషన్‌‌‌‌, ఏసీసీ షేర్ల వెయిటేజ్‌‌‌‌ను కూడా తన ఇండెక్స్‌‌‌‌లో తగ్గించింది. అంటే ఈ ఇండెక్స్‌‌‌‌లో ఈ కంపెనీల ఫ్రీ ఫ్లోట్ షేర్లు తగ్గనున్నాయని అర్థం. గతంలో ఈ నాలుగు కంపెనీలకు ఎంఎస్‌‌‌‌సీఐ ఇండెక్స్‌‌‌‌లో 0.4 శాతం వెయిటేజ్ ఉండేది.