న్యూఢిల్లీ: అదానీ విల్మార్ లిమిటెడ్‌లో (ఏడబ్ల్యూఎల్) మిగిలిన ఏడు శాతం వాటాను అదానీ గ్రూప్ బ్లాక్ డీల్ ద్వారా అమ్మింది. షేర్లను వ్యాన్‌గార్డ్, చార్లెస్ షాబ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, టాటా ఎంఎఫ్, క్వాంట్ ఎంఎఫ్, బంధన్ ఎంఎఫ్ వంటి దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొన్నాయి.
సింగపూర్, యూఏఈ, ఇతర ఆసియా మార్కెట్ల నుంచి పలు అంతర్జాతీయ పెట్టుబడిదారులు కూడా వాటాలను కొనుగోలు చేశారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ తన 44 శాతం వాటాను పూర్తిగా విక్రయించగా, సింగపూర్ ఆధారిత విల్మార్ ఇంటర్నేషనల్ ఇప్పుడు దాదాపు 57 శాతం వాటాతో ఏడబ్ల్యూఎల్కు ఏకైక ప్రమోటర్‌గా మారింది. ఫార్చ్యూన్ పేరుతో ఇది వంటనూనెలు అమ్ముతుంది.
