
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధి చెందుతుందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తెలిపింది. మొదటి క్వార్టర్లో 7.8 శాతం బలమైన వృద్ధి ఉన్నప్పటికీ, అమెరికా సుంకాల ప్రభావం ఎగుమతులపై పడడం వల్ల వృద్ధి అవకాశాలు తగ్గుతాయని పేర్కొంది.
ఏడీబీ ఏప్రిల్‌లో 7 శాతం వృద్ధిని అంచనా వేసింది.వినియోగం, ప్రభుత్వ ఖర్చు మెరుగుపడటం వల్ల మొదటి క్వార్టర్లో జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధ్యపడింది. అయినప్పటికీ, అమెరికా సుంకాల వల్ల ముఖ్యంగా 2026 ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో, 2027 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిని తగ్గిస్తాయి.
దేశీయ డిమాండ్ సేవల ఎగుమతులు ఈ ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయని ఏడీబీ తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం అంచనాను కూడా 3.1 శాతానికి తగ్గించింది.