హైదరాబాద్, వెలుగు: జీవన రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీలో చీలిక ఏర్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరికను హరీశ్ రావు వ్యతిరేకిస్తున్నారని, అందుకే హరీశ్‌ను కేటీఆర్ బతిమలాడి జగిత్యాలకు తీసుకెళ్లి జీవన్ రెడ్డిని కలిపించారని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్‌కు జీవన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అక్కడ హరీశ్ వెళ్లలేదని, బీజేపీ నేతలను కలిసేందుకు ఆయన రహస్యంగా ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. బీఆర్ఎస్లో చీలికకు హరీశ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జీవన్ రెడ్డి వల్లే ఇప్పుడు బీఆర్ఎస్లో ముసలం మొదలైందన్నారు.

