వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే : అద్దంకి దయాకర్

వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే : అద్దంకి దయాకర్

బీఆర్ఎస్, కాంగ్రెస్‭తో కలవాలంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తప్పుబట్టారు. వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అన్నారు. వెంకట్ రెడ్డి ప్రవర్తన పై ఆయన మండిపడ్డారు. క్యాడర్ మనోధైర్యం దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్‭గా వ్యవహరించాలని అద్దంకి దయాకర్ కోరారు. గతంలో వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పారు. తాము ఒంటిరిగా అధికారంలోకి రామని.. సీనియర్ నేతలు అందరూ కలిస్తే 40 నుంచి 50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు సెక్యులర్ పార్టీలని అన్నారని అద్దంకి ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలను అదిష్టానం సీరియస్ గా తీసుకుని వెంకట్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.