హరీశ్‌‌‌‌‌‌‌‌ రావుకు ఇంకా భూమి పిచ్చి పోలేదు : అద్దంకి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

 హరీశ్‌‌‌‌‌‌‌‌ రావుకు ఇంకా భూమి పిచ్చి పోలేదు : అద్దంకి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • నాదర్‌‌గుల్ భూములపై ఆయన మాటలు హాస్యాస్పదం: అద్దంకి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: బీఆర్ఎస్ నాయకులకు భూ బాగోతాలు తప్ప మరో అంశం కనబడటం లేదని, అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు నానా హంగామా చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు.  ఆయనకు ఇంకా భూమి పిచ్చి పోలేదని ఆదివారం ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో విమర్శించారు.  మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు నాదర్ గుల్ భూముల విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఈ అంశంలో తనను తానే హరీశ్‌‌‌‌‌‌‌‌ తప్పుదోవ పట్టించుకుంటున్నారని పేర్కొన్నారు. ఒకవైపు కోర్టు తీర్పుల గురించి మాట్లాడుతూ, మరోవైపు రైతులకు అన్యాయం జరుగుతోందని చెప్పడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. అసలు ఆ భూములు ప్రభుత్వానివా? ప్రైవేట్ వ్యక్తులవా? అనే విషయంలో స్పష్టత లేకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పేరును అనవసరంగా తెరపైకి తెచ్చి హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు బ్లాక్‌‌‌‌‌‌‌‌మెయిల్‌‌‌‌‌‌‌‌కు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా సంపాదించిన భూముల ఫైళ్లు క్లియర్ కాకపోవడంతోనే ఈ విమర్శలు చేస్తున్నారన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌ను అడ్డం పెట్టుకుని అసైన్డ్ భూములు, లావణి పట్టాలు, కోర్ట్ ఆఫ్ వార్డ్స్ భూములను బ్లాక్ లిస్టులో పెట్టి.. ఆ తర్వాత వాటిని తమ బినామీలకు అప్పగించే కుట్రలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూములను బీఆర్ఎస్ నాయకులు ఎలా కబ్జా చేశారో త్వరలో సీబీసీఐడీ విచారణలో తేలుతుందని చెప్పారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలు చూసి బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదలను రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.