ఓటర్ లిస్ట్ అభ్యంతరాలు పరిష్కరించండి : అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు

ఓటర్ లిస్ట్ అభ్యంతరాలు పరిష్కరించండి : అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు

యాదాద్రి, వెలుగు: ముసాయిదా ఓటరు లిస్ట్​పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాలని అడిషనల్​ కలెక్టర్​ ఏ. భాస్కరరావు ఆదేశించారు.  భువనగిరి, భూదాన్​పోచంపల్లి మున్సిపాలిటీల్లో ఓటరు లిస్ట్​పై వచ్చిన అభ్యంతరాలను ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ఫొటో ఓటరు లిస్ట్​ సవరణ, పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటో ఓటరు లిస్ట్​ ప్రకటనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరూ లిస్ట్​లో ఉండేలా పర్యవేక్షించాలని, ఓకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. 

13న పోలింగ్​ సెంటర్ల లిస్ట్​, 16న తుది ఓటర్ల లిస్ట్​ రిలీజ్​ చేయాలన్నారు. అనంతరం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పోచంపల్లిలో నామినేషన్​ స్వీకరణ సెంటరైన వినోబాభావే మందిరం, భువనగిరి మండలం దివ్యబాల స్కూల్​లో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్​, రిసెప్షన్​ సెంటర్​ను సందర్శించి పరిశీలించారు. భద్రతా చర్యలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో ఆయన అడిగి తెలుసుకున్నారు. భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం, పోచంపల్లి తహసీల్దారు శ్రీనివాస్ రెడ్డి, వార్డు అధికారులు, సిబ్బంది ఉన్నారు.