వనపర్తి జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మారుద్దాం..

వనపర్తి  జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మారుద్దాం..

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అడిషనల్  కలెక్టర్  ఖీమ్యానాయక్  ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్​లో నార్కోటిక్  కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గంజాయి రవాణా, సాగు, మాదక ద్రవ్యాలు వాడుతున్న వారిపై పెట్టిన కేసుల వివరాలను డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 8 కేసులు నమోదైనట్లు తెలిపారు. 

అడిషనల్​ కలెక్టర్​ మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాల నివారణపై నిఘా పెట్టాలని సూచించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో యాంటీ డ్రగ్  కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మాదకద్రవ్యాలతో జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​ యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ కలెక్టర్లు శ్రావ్య, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.