మొంథా తుఫాన్ నష్టం వివరాలు తెలియజేయాలి : అడిషనల్ కలెక్టర్లు పి.అమరేందర్,

మొంథా తుఫాన్ నష్టం వివరాలు తెలియజేయాలి : అడిషనల్ కలెక్టర్లు పి.అమరేందర్,

కందనూలు , వెలుగు : మొంథా తుఫాన్​కారణంగా నష్టపోయిన వివరాలను తెలియజేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా అన్ని శాఖలకు సంబంధించిన నష్టాల పై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాఖలవారీగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి, వాటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చు వివరాలపై రిపోర్టు ఇవ్వాలన్నారు. పంట నష్టం అంచనా కచ్చితంగా ఉండాలని, వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సహా పంపాలని తెలిపారు.

 తాత్కాలిక పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని చెప్పారు. జిల్లాలో దెబ్బతిన్న పంటల నష్టం వివరాలను అంచనా వేసి నివేదికను సమర్పించాలని వ్యవసాయశాఖ అధికారిని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, ఇండ్లకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని చెప్పారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గేదెలు, మేకలు, గొర్లు కోళ్ల వివరాలను స్పష్టంగా సేకరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్ రావు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి జ్ఞానశేఖర్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఈఈ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.