జనగామ అర్బన్, వెలుగు: జనగామ ఎంపీడీవో ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన పోస్టల్‌బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను అడిషనల్ కలెక్టర్ పింకేశ్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్, ధ్రువీకరణ ప్రక్రియ, బ్యాలెట్ బాక్సుల భద్రత, రికార్డు నిర్వహణ, సిబ్బంది సమన్వయం, సీసీటీవీ పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం, నియమావళి అమలు ముఖ్యమని అధికారులకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా, ఎటువంటి అంతరాయం లేకుండా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులంతా అప్రమత్తంగా బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.

