V6 News

ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్ వినోద్ కుమార్

ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్ వినోద్ కుమార్

వనపర్తి, వెలుగు :  వనపర్తి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఓటరు మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌ను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మ్యాపింగ్ పనుల పురోగతిని పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని గ్రామ పాలన అధికారులకు సూచించారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్నారు. సాదా బైనామా, భూ భారతి దరఖాస్తులపై వేగంగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా విజయవంతం చేయాలని చెప్పారు.