గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి
గుండాల, వెలుగు: మండలంలోని కాచనపల్లి స్పోర్ట్స్ పాఠశాలలో చదువుతున్న స్టూడెంట్స్ కు పౌష్టికాహారం అందించాలని, పదిలో నూటికి నూరు శాతం పాస్ అయ్యేలా చూడాలని గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం ఆ స్కూల్ ను సందర్శించి మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టూడెంట్స్ స్పోర్ట్స్ తో పాటు చదువులో కూడా ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ ఇల్లెందు భారతీ దేవి, దమ్మపేట ఏటీడీవో చంద్రమోహన్, భద్రాచలం ఐటీడీఏ క్రీడల అధికారి బి.గోపాల్ రావు, క్రీడా పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం బి.పద్మా, డిప్యూటీ వార్డెన్ గుమ్మడి పాపయ్య పాల్గొన్నారు.
