కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌ను కేంద్ర బొగ్గు గనులశాఖ అడిషనల్ సెక్రటరీ విష్మిత తేజ్ ఆదివారం సందర్శించారు. సింగరేణి సీఎండీ బలరాంనాయక్, డైరెక్టర్లతో కలిసి ఎస్టీపీపీ, ఎఫ్‌జీడీ, వాటర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన మీటింగ్‌లో సీఎండీ బలరాంనాయక్ మాట్లాడారు. కాలుష్య నియంత్రణలో భాగంగా రూ.700 కోట్లతో ఎఫ్‌జీడీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇది జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
800 మెగావాట్ల మూడో యూనిట్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, కార్బన్ డైఆక్సైడ్‌ను మిథనాల్‌గా మార్చే ప్లాంట్‌ను కూడా చేపడుతున్నట్లు అడిషనల్సెక్రటరీకి వివరించారు. ప్లాంట్‌లో 100 శాతం బూడిద వినియోగం జరుగుతుందని, రైల్వే ద్వారా బొగ్గు రవాణాతో కాలుష్యాన్ని అరికడుతున్నామన్నారు. అనంతరం ఈడీ బసివిరెడ్డి పవర్ ప్రజేంటేషన్ ద్వారా ప్లాంట్ గురించి వివరించారు. ముందుగా ఆమె గెస్ట్ హౌజ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆఫీసర్లు ఎన్‌వీకే.శ్రీనివాస్, సింగ్, బి.సంజీవరెడ్డి పాల్గొన్నారు.
