హిందువులు ఏని చేయాలన్నా ముందుగా పండితులను సంప్రదించి ముహూర్తం నిర్ణయం తీసుకుంటారు. వారి జన్మనక్షత్రం ఆధారంగా.. ఆ రోజు ఉండే నక్షత్రానికి తారాబలం గణించి శుభ ముహూర్తం చెబుతారు పండితులు. అయితే కొన్ని రోజులు మూఢం అని... శుభకార్యాలు చేయడదని అంటారు. అయితే ధనుర్మాసానికి వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉన్నా కొన్ని పనులు చేయకూడదని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏడాది ( 2025) ధనున్మారం డిసెంబర్ 16 న ప్రారంభమై .. వచ్చే ఏడాడా (2026) జనవరి 14 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఏమేమి పనులు చేయకూడదో తెలుసుకుందాం. . .!
కాలచక్రంలో పంటలు పండించే భూమికి కూడా రుతువుల మార్పులో కొంతకాలం విశ్రాంతి అవసరమైనట్టే.. గ్రహగతుల రీత్యా శుభకార్యాలకు కాస్త విరామం ఇవ్వాల్సిన సమయం ఉంటుంది.
ఉత్తరాదిన దీన్ని ఖర్మాస్ అని పిలిస్తే... తెలుగు నాట ‘ధనుర్మాసం’ అంటారు.
ధనుర్మాసం దైవారాధనకు ఇది అత్యంత పవిత్రమైన సమయమే అయినా, శుభకార్యాలకు మాత్రం నిషిద్ధం. ఈ సమయంలో పొరపాటున కూడా చేయకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది. ఈ రాశికి అధిపతి గురువు. సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు, సూర్య భగవానుడి శక్తి, ప్రభావం కాస్త తగ్గుతుందని, అందుకే ఈ సమయంలో కొత్త పనులు మొదలుపెట్టడం వల్ల అడ్డంకులు రావచ్చని పండితులు చెబుతారు.
గృహ ప్రవేశాలు, నిర్మాణాలు వద్దు: ఈ నెల రోజుల్లో గృహ ప్రవేశాలు అస్సలు చేయకూడదు. అలాగే కొత్త ఇంటి నిర్మాణం మొదలుపెట్టడం, ఇల్లు రినోవేషన్ లేదా పెద్ద రిపేర్లు చేయించడం వంటి పనులు పెట్టుకోవద్దు. ఈ సమయంలో చేసే పనులు కుటుంబంలో అశాంతిని కలిగిస్తాయని నమ్మకం. ఇంట్లో కొత్తగా దేవుడి విగ్రహాలను ప్రతిష్టించడం కూడా ఈ సమయంలో మంచిది కాదు.
కొత్త బిజినెస్, పెట్టుబడులకు బ్రేక్ : కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా భారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సంక్రాంతి వరకు ఆగడమే మంచిదని పండితులు చెబుతున్నారు. ధనుర్మాసంలో కొత్త వెంచర్లు మొదలుపెడితే అనుకోని అడ్డంకులు ఎదురై, ఆర్థిక ఇబ్బందులు లేదా నష్టాలు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యాపార ఒప్పందాల కోసం చేసే ప్రయాణాలు, అలాగే ఉపనయనం వంటి కార్యక్రమాలు కూడా ఈ సమయంలో చేయకూడదు.
పెళ్లిళ్లు, బంగారం కొనుగోళ్లు నిషిద్ధం: జీవితంలో ముఖ్యమైన వేడుకలైన పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు , నామకరణం (బారసాల) వంటి శుభకార్యాలన్నీ వాయిదా వేసుకోవాలి. సూర్యుడి ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ఈ వేడుకలకు విఘ్నాలు కలగవచ్చు. అలాగే కొత్త వాహనాలు, ఆస్తి కొనుగోళ్లు, బంగారం లేదా వెండి వంటి విలువైన వస్తువులు కొనడానికి ఇది సరైన సమయం కాదు. వీటిని కొనడం వల్ల ఆ వస్తువులతో పాటు ప్రతికూల శక్తి ఇంటికి వస్తుందని భావిస్తారు.
ఎందుకంటే..
పండితులు తెలిపిన వివరాల ప్రకారం ..ధనర్మాసంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. ఈ కారణంగానే శుభకార్యాలను చేపట్టకూడదు. మరో కథనం ప్రకారం.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏడాది పొడవునా సూర్యోదయం సమయంలో ఎప్పుడూ అశ్వరథాల ప్రయాణం అనేది ఆగదు. అయితే ఎండలో కూడా వేగంగా పరుగెత్తే ఈ గుర్రాలు.. ధనుర్మాసంలో మాత్రం చాలా అలసిపోతాయట. ఈ గుర్రాల కష్టం చూసిన సూర్యుడు విశ్రాంతి తీసుకునేందుకు ముందు వాటిని చెరువు వద్ద నీరు తాగేందుకు తీసుకెళ్తాడు. ఈ సమయంలో సూర్యుని రథం బలహీనంగా మారిపోతుందట. అప్పుడు తన గుర్రాలను చెరువు దగ్గర వదిలేసి గాడిదలకు రథానికి కడతాడు. అప్పుడు అవి బరువైన రథాన్ని నెమ్మదిగా లాగుతాయి. అందుకే సూర్యుడు ఈ నెల రోజుల పాటు నెమ్మదిగా ప్రయాణిస్తాడట. దీంతో ఈ సమయంలో సూర్యుని ప్రయాణం చాలా నిదానంగా ఉంటుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
