మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ రత్నం సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సైబర్ వారియర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే లోక్ అదాలత్ లో సైబర్ నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసులను పరిష్కరించాలన్నారు.
ముఖ్యంగా సంబంధిత కోర్టుల్లో రిఫండ్ ఆర్డర్ల కోసం రిక్విజిషన్ పిటిషన్లు సరైన పద్ధతిలో దాఖలు చేయాలని చెప్పారు. పుట్ ఆన్ హోల్డ్ కింద ఉన్న అర్హమైన ప్రతి కేసులో బాధితులను పిలిచి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పోలీసులు, వారియర్స్ పాల్గొన్నారు.
