టీ సేఫ్ యాప్ కు మంచి స్పందన..

టీ సేఫ్ యాప్ కు మంచి స్పందన..

హైదరాబాద్, వెలుగు: ట్రావెల్ ​సేఫ్​పేరుతో రాష్ట్ర పోలీసులు తీసుకొచ్చిన ‘టీ సేఫ్​’ యాప్ కు మంచి స్పందన లభిస్తున్నదని ఉమెన్ సేఫ్టీ వింగ్​ ఏడీజీ శిఖా గోయల్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన రిలీజ్ చేశారు. యాప్ ను ప్రారంభించిన ఐదు నెలల కాలంలోనే 10,958 మంది డౌన్​ లోడ్​ చేసుకున్నారని, 17,263 మంది ట్రిప్స్​ ను  ట్రాక్​ చేశామని వెల్లడించారు. మహిళలు, యువతులు, పిల్లలు ఎవరైనా నిర్భయంగా ప్రయాణించవచ్చనే భరోసా కల్పిస్తున్నామన్నారు. 

యాప్ ద్వారే కాకుండా వెబ్​సైట్, డయల్100 ద్వారా కూడా మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. టీ -సేఫ్‌‌‌‌‌‌‌‌ ద్వారా 100 లేదా 112 నంబర్‌‌‌‌‌‌‌‌కు కాల్‌‌‌‌‌‌‌‌చేస్తే 5 నిమిషాల్లో పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌, బ్లూకోల్ట్‌‌‌‌‌‌‌‌ వాహనాలు లొకేషన్ కు  వచ్చి ఆపదలో చిచ్చుకున్నవారిని కాపాడుతాయని వెల్లడించారు. యూజర్స్​తమ లైవ్‌‌‌‌‌‌‌‌ లొకేషన్‌‌‌‌‌‌‌‌ను  ఫ్యామిలీ మెంబర్స్​, ఫ్రెండ్స్​ కు కూడా షేర్​ చేసుకోవచ్చని తెలిపారు. టీసేఫ్​యాప్​ ను దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ పోలీసులు తీసుకొచ్చారు. మార్చి 12 న సీఎం రేవంత్​ రెడ్డి ఈ యాప్​ను ప్రారంభించారు. 4.8 రేటింగ్ తో ఈ యాప్​ గూగుల్​ ప్లేస్టోర్​లో అందుబాటులో ఉంది.