దేశంలో సెఫెస్ట్ సిటీ లిస్టులో మంగళూరు 1st ర్యాంక్.. రాజధాని ఢిల్లీ లాస్ట్..!

దేశంలో సెఫెస్ట్ సిటీ లిస్టులో మంగళూరు 1st ర్యాంక్.. రాజధాని ఢిల్లీ లాస్ట్..!

ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో సేఫెస్ట్ దేశాల జాబితాలో 67వ స్థానంలో నిలిచింది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 డేటా ప్రకారం 55.8 స్కోర్ సొంతం చేసుకుంది ఇండియా. ఇక దేశంలోని ఉత్తమ రక్షణ కలిగిన నగరాల జాబితాలో కర్ణాటకలోని మంగళూరు తొలి స్థానంలో నిలిచింది. ఈ నగరంలో తక్కువ క్రైమ్ రేట్, ప్రజలకు ఉత్తమ సౌకర్యాలు ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. 

ఇక గుజరాత్ లోని వడోదరా, అహ్మదాబాద్, సూరత్ మంగళూరు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక రాజస్థాన్ లోని జైపూర్ 5వ స్థానం దక్కించుకుంది. దీని తర్వాత నవీ ముంబై, తిరువనంతపురం, చెన్నై, పూణే, చండీఘడ్ నగరాలు టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 

ALSO READ : హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’..

ఇక దేశ రాజధాని ఢిల్లీ మాత్రం అట్టడుగు స్థానంలో నిలిచింది. నోయిడా, ఘజియాబాద్, న్యూఢిల్లీ నగరాలు దేశంలో అత్యంత ప్రమాదకరమైన నగరాల జాబితాలో చేర్చపడ్డాయి. ప్రధానంగా ఈ నగరాల్లో అధిక క్రైమ్ రేటు, మహిళలకు భద్రత కొరవడటం ముఖ్యమైన సమస్యగా ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. 

నంబియో సంస్థ నగరాల్లోని ప్రజలు రాత్రి, పగలు ప్రతి రోజూ ఎలా ఫీలవుతున్నారనే విషయాలను పరిగణలోకి తీసుకుని రిపోర్టులో ర్యాంకింగ్స్ ఇచ్చింది. నేరాలు, దొంగతనాలు, కార్ చోరీలు, భౌతిక దాడులు, పబ్లిక్ ప్రదేశాల్లో పోకిరీల ఆగడాలుతో పాటు రంగు, భాష, మతం ప్రాతిపధికన ఉన్న ఇబ్బందులను ఇందులో పరిగణలోకి తీసుకుంటారు. ప్రపంచంలోనే సురక్షితమైన నగరాల జాబితాలో మిడిల్ ఈస్ట్ దేశాలు టాప్ ర్యాంకింగ్స్ పొందాయి.