Vastu Tips: Vastu Tips : దేవుడి పటాలు కింద పెట్టొచ్చా లేదా..?

Vastu Tips:  Vastu Tips : దేవుడి పటాలు కింద పెట్టొచ్చా లేదా..?

ఇంట్లో ప్రతి వస్తువుకు వాస్తు ఉంటుంది.  దేవుడి పటాలు ఎక్కడ పెట్టాలి.. టేబుల్​ పై పెట్టాలా.. కింద పెట్టుకోవచ్చా.. లేవగానే దేవుడి పటాలు చూడాలంటే ఎలా కాళ్లు ఏ దిక్కున పెట్టి పడుకోవాలి.. వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్​ సూచిస్తున్న సలహాలను ఒకసారి పరిశీలిద్దాం..

ప్రశ్న: మా ఇల్లు చిన్నగా ఉంటుంది. ఇంట్లో ఒకవైపు పూజ స్థలం పెట్టుకున్నం. ఒక పూజారి సూచన మేరకు టేబుల్​ పై దేవుళ్లు పెట్టి పూజ చేస్తున్నాం. దేవుళ్ల చిత్రపటాలు పైన ఉండాలా? కింద ఉండాలా?

జవాబు: పూజగది పవిత్రమైంది. అందుకోసం ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసుకుంటే బెటర్. దేవుళ్ల చిత్రపటాలు కిందపెట్టి అటు, ఇటు తిరగడం మంచిది కాదు. కాబట్టి టేబుల్​ పై  పెట్టుకోవచ్చు. టేబులు సమాంతరంగా స్టూల్ పై కూర్చొని పూజలు కూడా చేసుకోవచ్చని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ సూచిస్తున్నారు.  .


ప్రశ్న : నిద్ర లేవగానే దేవుడి చిత్రపటాలు చూడటం అలవాటు. అందుకని కాళ్లు దేవుడి గది వైపు పెట్టుకొని పడుకుంటా. అలా దేవుడి వైపు కాళ్లు పెట్టొద్దన్నారు బంధువులు. నిద్రపోయేటప్పుడు ఫేసింగ్ ఎటువైపు ఉండాలి?

జవాబు: దేవుడి ముఖం వైపు కాళ్లు పెట్టడం అంత మంచిది కాదు. దక్షిణం వైపు తల పెట్టుకొని, ఉత్తరం వైపు కాళ్లు పెట్టుకోవచ్చు. లేదంటే పడమర వైపు తల పెట్టుకొని, తూర్పు వైపు అయినా కాళ్ళు పెట్టుకోవచ్చని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ అంటున్నారు.