కామెంట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి

కామెంట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. రాహుల్‌‌లో స్పష్టత, ధైర్యం కొరవడ్డాయని, ఆయన నిరుత్సాహంగా కనిపిస్తారని ఏ ప్రామిస్ ల్యాండ్ అనే పుస్తకంలో ఒబామా రాసుకొచ్చారు. దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురి ఒబామా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

‘మా ప్రియతమ నేత రాహుల్ గాంధీపై దురుసు కామెంట్లు చేసే ముందు సమకాలీన ప్రపంచ సమస్యలపై ఆయనతో ఓసారి సంభాషించాలని ఒబామాను కోరుతున్నా. అప్పుడే రాహుల్ వ్యక్తిత్వం, లక్షణాల గురించి ఒబామాకు తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. మా నాయకుడి గురించి నిర్ధారణకు వచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి.. లేకపోతే మీరు అజ్ఞానంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. మిరుమిట్లుగొలిపే కృత్రిమ వెలుగుల్లో పడి గందరగోళానికి గురవ్వొద్దు. అలాగే బావిలో కప్పలా ఆలోచించే మనస్తత్వాన్ని వీడితే మంచిది’ అని అధిర్ ట్వీట్ చేశారు.