
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు బీజేపీ కార్యకర్తలు అధిర్ రంజన్ చౌదరి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత రవీంద్ర నాయక్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అని సంబోధించిన అధిర్ రంజన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దేశానికి తొలిసారిగా ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి కావడం తట్టుకోలేకే కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
దేశ చరిత్రలో ఈ రోజును బ్లాక్ డేగా అభివర్ణించారు. ఆయన అధిర్ రంజన్ కాదని... అఘోరా రంజన్ అని ఫైర్ అయ్యారు. గతంలో కాంగ్రెస్ కూడా ఓ మహిళను రాష్ట్రపతిగా చేసిందన్న ఆయన... అధిర్ రంజన్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విమర్శించారు. సబ్ కా సాత్ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తోందన్న రవీందర్ నాయక్... అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ ఇలాంటి నీచానికి ఒడిగట్టిందని విమర్శించారు.