ఆదిలాబాద్టౌన్, వెలుగు: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, వెంటనే సమస్యలు పరిష్యరించాలని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంటా నిర్వహణ, తక్ పట్టీల జారీ, మార్కెట్‌లో వసతులపై వివరాలు సేకరించారు. రైతుల విజ్ఞప్తి మేరకు మరో ఐదు కాంటాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అంతకుముందు రాంపూర్ రోడ్ లోని చాణక్య జిన్నింగ్ మిల్ లో ఉన్న 90 వేల బస్తాల సామర్థ్యం గల గోదాంను పరిశీలించారు. అడిషనల్కలెక్టర్ ఆర్.ఎస్.చిత్రు, మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి గజానన్, డీటీఓ శ్రీనివాస్ ఉన్నారు.
వనరులు సమకూర్చుకొని కొనుగోళ్లు స్పీడప్ చేయాలి
కామారెడ్డి, వెలుగు: మక్క కొనుగోళ్లలను స్పీడప్చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ఆదేశించారు. మక్కల కొనుగోళ్లపై కలెక్టరేట్లో శనివారం అధికారులతో రివ్యూ నిర్వహించారు. హామాలీలు, రవాణాకు అవసమైన వెహికల్స్సమకూర్చుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న గోడౌన్లను స్వాధీనం చేసుకొని మక్కలను వాటిల్లో నిల్వ ఉంచాలన్నారు.
