సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి..ప్రజావాణిలో కలెక్టర్లు

సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి..ప్రజావాణిలో కలెక్టర్లు

నిర్మల్/ఆదిలాబాద్​టౌన్/నస్పూర్, వెలుగు: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదిలాబాద్ ​కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోనీతో కలిసి  దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలు పలు సమస్యలపై అర్జీలు సమర్పించారు. వివిధ మండలాల నుంచి 114 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

మంచిర్యాల కలెక్టరేట్​లో ఆర్డీవో శ్రీనివాసరావుతో కలిసి అడషనల్ కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 72 దరఖాస్తులు వచ్చాయని, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.  ఎస్సీ కులాల రోస్టర్ పాయింట్లు సవరించేంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపివేయాలని కోరుతూ మాలమహానాడు సంఘం నేతలు వినతిపత్రం అందించారు. 

మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కుంభాల రాజేశ్, రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొట్ట మధుకర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా సరైన డేటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ వల్ల మాలలు విద్య, ఉద్యోగ రంగాలలో తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. గ్రూప్-- 3లో మాలలతో పాటు మరో 25 కులాలకు అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రోస్టర్ విధానాన్ని సవరించాలన్నారు. 

పథకాల అమల్లో స్పీడ్ పెంచాలి

ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశిం
చారు. కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఆమె వినతులను స్వీకరించారు. అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు ప్రభుత్వ వసతిగృహాలు, స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలు, ఎరువుల దుకాణాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, రేషన్ కార్డుల జారీ, వనమహోత్సవం, ఫీవర్ సర్వేలు, వెటర్నరీ క్యాంపులు, పీఎం ఆవాస్ యోజన వంటి కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశిం చారు. 

వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు వైద్య, పంచాయతీ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.